కారు లోన్ తీసుకునే వారికి SBI బంపరాఫర్లు..!

-

మీరు కొత్తగా కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా…? అయితే ఇది మీకు శుభవార్త అనే చెప్పాలి మరి. తాజాగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ కస్టమర్ల కోసం పండుగ ఆఫర్లు తీసుకువచ్చింది. దీంతో కారు కొనే వారికి చాలా ఆఫర్లు ఉన్నాయని బ్యాంకు అధికారులు తెలిపారు. దసరాకు కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా…? అయితే మీకు శుభవార్త. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. బ్యాంక్ నుంచి కార్ లోన్ తీసుకునే వారు ఏకంగా 5 లాభాలు పొందొచ్చు. మరి అవి ఏంటో చూద్దామా…

State Bank of India

స్టేట్ బ్యాంక్ కారు రుణాలుపై అతి తక్కువ వడ్డీ వసూలు చేస్తోంది. ఎస్‌బీఐ కార్ లోన్ ‌పై వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. అయితే కారు లోన్ తీసుకునే వారు రుణ మొత్తంపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెలించాల్సిన అవసరం లేదు. అలాగే జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కలదు. అంతేకాదు కారు లోన్ కోసం బ్యాంక్‌ కు వెళ్లాల్సిన పని కూదా లేదు.

ఇదంత యోనో యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ రుణానికి తక్షణ సూత్రప్రాయ ఆమోదం పొందొచ్చు. ఇక కారు ధరకు సమానమైన మొత్తాన్ని రుణం కింద పొందొచ్చు. అంటే కారు ఆన్ ‌రోడ్ ధరకు సమానమైన మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన మోడళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఇందులో భాగంగానే మీరు యోనో యాప్ ద్వారా ఫోర్డ్ ఎండీవర్ కారు కొనుగోలు చేస్తే ఉచితంగా రూ.22 వేల యాక్ససిరీస్ పొందొచ్చు. ఇందుకోసం యోనో యాప్‌ లోకి వెళ్లి షాప్ అండ్ ఆర్డర్స్ ‌లోకి వెళ్లి ఆటోమొబైల్స్ సెక్షన్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version