జీరో బ్యాలెన్స్ అకౌంట్ చార్జీలపై SBI క్లారిటీ…!

-

స్టేట్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై ఐఐటీ-బాంబే ఒక అధ్యయనం చేసింది. దీని ద్వారా పలు విషయాలు తెలిసాయి. అవి ఏమిటంటే..? జీరో బ్యాలెన్స్ అకౌంట్ల నుంచి 2015-2020 మధ్య రూ.300 కోట్లు సర్వీస్ ఛార్జీల రూపంలో బ్యాంకు వసూలు చేసిందన్నది తేలింది. కేవలం ఈ ఒక్క బ్యాంక్ కాక ఇతర బ్యాంకులు కూడా సేవల పేరుతో అత్యధికంగా ఛార్జీలు వసులు చేసినట్టు తేలింది.

ఇది ఇలా ఉంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్లకు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు వసూలు చేస్తున్నామని, 2016 జూన్ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చాయని, ఈ ఛార్జీలపై కస్టమర్లకు ముందుగానే చెప్పమని ఎస్బీఐ అంది.

అయితే BSBDA అకౌంట్లకు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని అంత కంటే ఎక్కువ అయితే చార్జీలు పద్ధతాయని అంది. 2012 ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఇది ఇలా ఉంటే 2021 జనవరి 1 తర్వాత డిజిటల్ పద్ధతిలో నిర్వహించిన లావాదేవీలకు ఏవైనా చార్జీలు వసూలు చేసినట్టైతే వాటిని రీఫండ్ చేయాలంటూ 2020 ఆగస్టులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT ఆదేశించింది.

అలానే ఇక పై ఎటువంటి చార్జీలు వసూలు చెయ్యకూడదు అని అన్నారు. ఈ ఆదేశాలతో ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్న కస్టమర్లకు డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను 2020 సెప్టెంబర్ 14న రీఫండ్ చేసింది. ఆ తర్వాతి రోజు నుంచి డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదు.

ఇది ఇలా ఉంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ హోల్డర్లు డిజిటల్ పేమెంట్ పద్ధతుల్ని పాటించేలా ప్రోత్సహించేందుకు ఛార్జీలను వసూలు చేశామని ఎస్‌బీఐ తెలిపింది. అన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై ఎస్ఎంఎస్ సర్వీసులు, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటనెన్స్ ఛార్జీలను కూడా తొలగించామని ఎస్‌బీఐ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version