స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు మరోసారి ఝలక్ ఇచ్చింది. నగదు ఉపసంహరణ కోసం కొత్త నిబంధనలు జారీ చేసింది. బ్యాంకులో పరిమితికి మించి లావాదేవీలను నిర్వహిస్తే ఇక వాటిపై కచ్చితంగా రుసుము కట్టే విధంగా రూల్స్ ను తీసుకు వచ్చింది. అయితే ఇందులో సగటు నెలవారి మొత్తం రూ. 25 వేల వరకు ఉండే ఖాతాదారుడు బ్యాంకులో కేవలం రెండుసార్లు మాత్రమే ఉపసంహరించుకునేలా, అలాగే రూ. 25 వేల నుంచి రూ.50 వేల వరకు అయితే పది సార్లు విత్ డ్రా చేసే విధంగా, అలాగే 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంటే వారికి 15 సార్లు ఉచితంగా తీసుకోవడానికి అవకాశం కల్పించింది. అలాగే లక్ష పైన ఉండేవారికి అపరిమితంగా నగదు తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఒకవేళ ఎవరైనా వారి పరిమితిని మించి నగదు ఉపసంహరణ ఇస్తే ఒక్కో లావాదేవీకి రూ.50 తో పాటు జిఎస్టి చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో మాత్రం అపరిమిత లావాదేవీలను చేసుకోవచ్చు.
ఇక అలాగే 25 వేల లోపు ఉన్న వారు నెలకు ఏటీఎం లో నుండి కేవలం ఎనిమిది సార్లు మాత్రమే నగదు తీసుకోవచ్చు. అయితే ఇతర బ్యాంకులు ఏటీఎం నుండి మూడుసార్లు మాత్రమే అవకాశం ఇవ్వగా, ఎస్బిఐ లో ఐదు సార్లు వరకు ఉచితంగా నగదు తీసుకోవచ్చు. కాకపోతే ఈ రూల్స్ దేశంలోని కేవలం ఆరు మెట్రో నగరాలకు మాత్రమే వర్తిస్తాయి. మిగతా నగరాలలో ఇతర ఏటీఎంలో ఐదు సార్లు ఎస్బిఐ బ్యాంకు ఏటీఎంలలో, ఐదు సార్లు ఇతర ఎటిఎం లలో నగదు ఉపసంహరించుకోవచ్చు. అలాగే 25 వేల నుండి లక్ష వరకు ఉన్న బ్యాంకు ఖాతాదారులు మొత్తం 8 సార్లు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ నిర్దేశించిన పరిమితిని దాటితే ఒక్కొక్క లావాదేవీకి రూ.10 నుండి రూ. 20 రూపాయల వరకు బ్యాంకు వసూలు చేయనుంది.