SBI కొత్త రూల్..ఆ యాప్ వాడేవారు ఆ స్టెప్స్ ఫాలో అవ్వాల్సిందే..!!

-

ఆర్బీఐ ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది..బ్యాంకులన్నీ చెక్కుల క్లియరెన్స్ కోసం పాజిటీవ్ పే సిస్టమ్  పాటిస్తున్నాయి..రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన ఉన్న చెక్స్ ఎన్‌క్యాష్ చేయాలంటే పాజిటీవ్ పే సిస్టమ్ పాటించాలి. ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వచ్చాయి. కస్టమర్లు పాజిటీవ్ పే సిస్టమ్ పాటించకుండా రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్స్ ఇస్తే బ్యాంకు వాటిని వెనక్కి పంపే అవకాశం ఉంది.

కస్టమర్లు ఎవరికైనా చెక్ ఇచ్చినప్పుడు ఆ వివరాలను బ్యాంకుకు కూడా తెలియజేయాలి. ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా బ్యాంకుకు సమాచారాన్ని అందించవచ్చు..ఎస్‌బీఐ కస్టమర్లు ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌లో సులువుగా తాము ఇచ్చిన చెక్ వివరాలను బ్యాంకుకు వెల్లడించవచ్చు..కాగా, మొబైల్ యాప్ ద్వారా ఎలా వివరాలను తెలపాలో కొన్ని స్టెప్స్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం…
యోనో యాప్ ద్వారా చెక్ వివరాలను ఎలా సబ్మిట్ చెయ్యాలి..

*. ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగా యోనో ఎస్‌బీఐ యాప్ డౌన్‌లోడ్ చేయాలి.

*. తమ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

*. ఆ తర్వాత యోనో ఎస్‌బీఐ యాప్‌లో లాగిన్ కావాలి.
*. లెఫ్ట్ కార్నర్‌లో మెనూ ఆప్షన్ క్లిక్ చేయాలి.
*.  ఆ తర్వాత Service Request ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
*. ఆ తర్వాత Positive Pay System పైన క్లిక్ చేయాలి.
*. ఆ తర్వాత Make a Request ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
*.  View Request ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు సబ్మిట్ చేసిన చెక్ వివరాలు ఉంటాయి.
*. చెక్ తేదీ, చెక్ అమౌంట్, బెనిఫీషియరీ పేరు లాంటి వివరాలన్నీ ఎంటర్ చేసి తర్వాతి స్టెప్‌లోకి వెళ్లాలి.
*. నియమనిబంధనలన్నీ అంగీకరించిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
*. ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు ఎంటర్ చేసిన వివరాలు బ్యాంకుకు సబ్మిట్ అవుతాయి.

మీరు ఇచ్చిన వివరాలు, చెక్ పైన ఉన్న వివరాలను పోల్చి చూసి బ్యాంకు చెక్కును క్లియర్ చేస్తుంది. ఒకవేళ వివరాలు సరిపోలకపోతే చెక్కును బ్యాంకు ఎన్‌క్యాష్ చేయదు. యోనో ఎస్‌బీఐ యాప్‌లో ఫాలో అయిన స్టెప్స్ యోనో లైట్ యాప్‌లో కూడా ఫాలో అవొచ్చు..500000 కన్నా ఎక్కువ చెక్ వేసేవాల్లు ఈ రూల్స్ తప్పక పాటించాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version