నీట్ పరీక్షలో భారీ స్కామ్…!

మెడికల్ విద్యార్థుల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్ష నీట్ లో భారీ కుంభ కోణం బయటపడింది. మహారాష్ట్ర నాగ్ పూర్ కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ కుంభకోణం కు ప్రయత్నించినట్లు సీబీఐ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. రూ. 50 లక్షలు ఇస్తే మరొకరితో పరీక్ష రాయిస్తామని కోచింగ్ సెంటర్ ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే దీనిపై సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు పరీక్ష రోజు వెళ్లి నిందితులను పట్టుకున్నారు. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తో పాటు కొంతమంది విద్యార్థులపై కూడా కేసులు నమోదు చేశారు. అంతే కాకుండా దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది.