సీఎస్ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) ఒక కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ కార్పోరేట్, ప్రైవేట్ స్కూల్స్ లో చదివే పిల్లలకు మంచి అవకాశం కల్పించింది. వారు లక్ష రూపాయలను గెలుచుకునే ఆఫర్ ఇచ్చింది. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపించే ఇన్నోవేటివ్ ఐడియా మీ దగ్గరుంది అనుకుంటే వెంటనే ఈ పోటీలో పాల్గొనాలి అని ఒక ప్రకటనలో తెలిపింది.
పిల్లల్లో దాగి ఉన్న ఆలోచనలు అదే విధంగా ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకుని రావడానికి గానూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతుంది. అయితే ఇక్కడ ఒక కండీషన్ ఉంది. పన్నెండవ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే పద్ధెనిమిదేళ్లలోపు మాత్రం వయసు ఉండాలి అని పేర్కొంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి రూ. లక్ష ఇస్తారు.
సెకండ్ ప్రైజ్ ఇద్దరికి ఉంటుంది. రూ. 50 వేలు ఉంటుంది. అలాగే థర్డ్ ప్రైజ్ ముగ్గురికి ఉంటుంది. రూ. 30 వేలు అందిస్తారు. ఫోర్త్ ప్రైజ్ నలుగురికి ఉంటుంది. రూ.20 వేలు, ఫిఫ్త్ ప్రైజ్ ఐదుగురికి రూ. 10 వేలు. ఇస్తారు. ciasc.ipu@niscair.res.in కు పూర్తి వివరాల కోసం సంప్రదించాలి. www.csir.res.in వెబ్‌సైట్‌లో కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇన్నోవేటివ్ ఐడియా లేదా క్రియేటివ్ డిజైన్ లేదా పరిష్కారాన్ని ఏదైనా ఇంగ్లిష్ లేదా హిందీలో 5,000 పదాలకు మించకుండా రాయాలని… మీ స్కూల్ ప్రిన్సిపల్ ధ్రువీకరణతో పంపించాలని పేర్కొంది. చివరి తేదీ జూన్ 30.