తెలంగాణలో దసరా తరవాతే స్కూల్స్, కాలేజ్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అది కూడా దశల వారీగా ప్రారంభించాలనే యోచనలో విద్యా శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. మొదట హయ్యర్ క్లాసెస్ వారికి తరగతులు ప్రారంభించి ఆ తర్వాత లోయర్ క్లాసెస్ వారికి తరగతులు ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. నవంబర్ 2 నుండి ఈ హయ్యర్ క్లాసెస్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు.
అయితే ఇప్పటికే కేంద్రం అన్లాక్ 5 గైడ్ లైన్స్ విడుదల చేసింది. దానిని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం కూడా ఈరోజే ఈ అన్లాక్ 5 గైడ్ లైన్స్ విడుదల చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా అన్లాక్ 5 గైడ్ లైన్స్ విడుదల చేయలేదు. నిజానికి దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు కేంద్ర విద్యా శాఖ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. అన్‌లాక్ 5.0 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు, కాలేజీలు పరిమితంగా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. కానీ మళ్ళీ దసరా సెలవులు ఇవ్వాల్సి ఉండడంతో ఈ గోల అంతా ఎందుకుని భావించిన ప్రభుత్వం దసరా తరువాతే తెరవాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు.