తెలంగాణాలో పాఠశాలలు రీ- ఓపెన్ కానున్నాయి. వచ్చే నెల ఒకటవ తారీఖు నుంచి పాఠశాలలు రీ- ఓపెన్ చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే కింది స్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎనిమిదవ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధనా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. విడతల వారీగా తరగతులు ప్రారంభించాలని యోచిస్తోంది సర్కార్.
వివిధ రాష్ట్రాల్లో స్కూల్స్ ఓపెన్ చేసేందుకు అమలు చేసేందుకు అనుసరిస్తున్న విధానాలు స్టడీ చేస్తోంది కేసీఆర్ సర్కార్. ఇక అటు ఆగస్ట్ 30 వరకు ఇంటర్ అడ్మిషన్ ల గడువు ను పెంచింది తెలంగాణ సర్కార్. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు అదుపులో నే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 482 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు.ప్రస్తుతం తెలంగాణ లో 8137 కరోనా కేసులు యాక్టివ్ లో ఉన్నాయి.