ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం : మంత్రి ఆదిమూలపు

-

ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని…విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యాశాఖలో నాడు- నేడు పై ఇవాళ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష ముగిసిన అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని..ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

జూల్ 15-ఆగస్టు 15 వరకు వర్క్ బుక్కులపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆగస్టు 15 లోపు పాఠశాల పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. పాఠశాలల్లో నాణ్య మైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని… ప్రభుత్వం నూతన విద్యా విధానం తప్పనిసరిగా అమలు చేస్తుందని వెల్లడించారు.

నూతన విద్యా విధానం అమలు వల్ల ఏ స్కూల్ మూతపడదని.. ఏ ఉపాధ్యాయుడి పోస్టు తగ్గదన్నారు. రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మాణం పూర్తి చేస్తామని… నాడు-నేడు కింద పనుల కోసం 16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 30శాతం పదోతరగతి , 70 శాతం ఇంటర్ ప్రధమ సంవత్సరం మార్కులు ప్రాతిపదికగా ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తామన్నారు. ఈనెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version