శాస్త్రవేత్తలు అరుదైన బ్లడ్ గ్రూప్‌ని కనుగొన్నారు. యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్త బ్లడ్ గ్రూప్‌కు ‘ఈఆర్’ అని నామకరణం చేశారు. ఈ బ్లడ్ గ్రూప్ ఆవిష్కరణ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రక్తంలోని ప్రోటీన్స్ ఆధారంగా బ్లడ్ గ్రూపులను విడదీస్తారు. ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఈ ప్రోటీన్స్ ఉంటాయి. ఇప్పటివరకు ఏ, బీ, ఏబీ, ఓ వంటి బ్లడ్ గ్రూపులను మాత్రమే చూశాము. ఇప్పుడు తాజాగా ‘ఈఆర్’ కూడా ఈ జాబితాలో చేరింది.
30 ఏళ్ల మిస్టరీతో కూడిన పరిశోధనను ఛేదించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ బ్లడ్ గ్రూప్‌లకు సంబంధించిన రెండు కేసులను ఇటీవల పరిశోధకులు ఎదుర్కొన్నారు. రక్తంలో సమస్య వల్ల ఇద్దరు మహిళల గర్భంలో ఉన్న శిశువులు మృతి చెందారు. దీనిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు వారి బ్లడ్ గ్రూప్‌ను ఈఆర్‌గా తేల్చి.. 30 ఏళ్ల క్రితం నాటి అధ్యయనాన్ని పరిశోధించారు. శరీరంలో ఒకే బ్లడ్ గ్రూప్ లేకుండా తీవ్ర సమస్యతో మరణం సంభవిస్తుందని గుర్తించారు. తల్లి, శిశువు బ్లడ్ గ్రూపులు వేరుగా ఉన్నప్పుడే ఈ ఘటనలు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు.