రుతువు మారుతున్నప్పుడు డైట్ లో చేసే చిన్న చిన్న పొరపాట్లేమిటో తెలుసుకోండి.

-

ప్రతీ నాలుగు నెలలకోసారి రుతువు మారుతుంది. దానికనుగుణంగా మన శరీరం ఆహారాలని కోరుకోవడంతో పాటు తన పద్దతిని మార్చుకుంటుంది. వర్షాకాలం తడవడం, చలికాలం వణకడం, ఎండాకాలం ఉడకడం కామనే. కానీ ఈ కాలాలు మారుతున్న సమయం ఉంటుంది చూసారు. అది చాలా విచిత్రంగా ఉంటుంది. చలికాలం నుండి ఎండాకాలంలోకి మారుతుంటే ఉక్కపోస్తున్నట్టే అనిపించి ఫ్యాన్ వేసుకుని నిద్రపోతే చలిపెట్టి చంపుతుంది. ఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా అనిపించి మనల్ని కంగారు పెట్టేస్తుంది. సరిగ్గా ఈ టైమ్ లోనే మనం తీసుకునే ఆహారాల్లో తప్పులు చేస్తుంటాం.

ఆ తప్పులేంటో తెలుసుకుని వాటిని చక్కదిద్దుకుని సరైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఎక్కువ నీళ్ళు తాగకపోవడం

మాటిమాటికీ దాహం వేయకపోతే సరైన వేసవి కాలం రాలేదని అర్థం. అలాంటప్పుడు కూడా కావాల్సినన్ని నీళ్ళు తాగి శరీరాన్ని చల్లబరుస్తూ ఉండాలి. లేదంటే శరీరం బలహీనంగా మారి అనేక సమస్యలకి దారి తీస్తుంది.

వండే ముందు కూరగాయని కడగడం

కూర వండే ముందు కూరగాయలని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే కలుషితమైపోయి మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.

సరిగ్గా వండని ఆహారాలని తినడం

ప్రతీదాన్ని డీప్ గా ఫ్రై చేసి తినమని చెప్పడం ఉద్దేశ్యం కాదు. కాకపోతే సరిగ్గా వండని వాటిని తినకూడదని తెలుసుకోండి.

సరైన వేళ భోజనం చేయకపోవడం

ప్రతీ రోజూ ఒకే సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం. దానివల్ల శరీర జీవక్రియ దెబ్బతింటుంది. అలాంటప్పుడే జీర్ణ సమస్యలు వస్తాయి.

జంక్ ఫుడ్ మానకపోవడం

కాలమేదైనా జంక్ ఫుడ్ పూర్తిగా మానేయడమే ఉత్తమం. ఏ రుతువులోనూ జంక్ ఫుడ్ ఆరోగ్యకరమైనది కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version