బీజేపీ ఎమ్మెల్యే పై రెండో సారి లైంగిక దాడి కేసు

-

రాజ‌స్థాన్ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ప్ర‌తాప్ భీల్ పై మ‌రో సారి లైంగిక దాడి కేసు నమోదు అయింది. కాగ ఈయ‌న పై ప‌ది నెల‌ల క్రితం కూడా లైంగిక దాడి కేసు న‌మోదు అయింది. ఈ రెండు కేస‌లు ల‌లో కూడా బీజేపీ ఎమ్మెల్యే ప్ర‌తాప్ భీల్ ఉద్యోగాల పేరుతో, వివాహం చేసుకుంటా.. అని న‌మ్మించి మోసం చేసిన‌వే. అయితే తాజాగా రాజ‌స్థాన్ లో ఒక మ‌హిళ త‌న‌కు ఉద్యోగం ఇప్పిస్తాన‌ని చెప్పి అత్యాచారం చేశాడ‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. గ‌త రెండు సంవ‌త్స‌రాలు గా ఎమ్మెల్యే ప్ర‌తాప్ భీల్ త‌న పై అత్యా చారం చేస్తున్నాడ‌ని ఆరోపించింది.

అంతే కాకుండా త‌న‌ను పెళ్లి కూడా చేసుకుంటాన‌ని న‌మ్మించాడ‌ని తెలిపింది. కానీ ఇప్పుడు మొఖం చాటేస్తున్నాడ‌ని అంది. ఎమ్మెల్యే సిబ్బంది కూడా త‌న‌ను బెదిరించారని పోలీసు ల‌కు తెలిపింది. దీంతో పోలీసులు బాధిత మ‌హిళకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి కేసు న‌మోదు చేశారు. అంతే కాకుండా ఈ కేసు ద‌ర్యాప్తు ను సీఐడీ కి అప్ప‌గించారు. కాగ 10 నెల‌ల క్రితం ఎమ్మెల్యే ప్ర‌తాప్ భీల్ పై మ‌ధ్య ప్ర‌దేశ్ కు చెందిన మ‌హిళ త‌న పై అత్యాచారం చేశాడ‌ని ఆరోపిస్తు పోలీసుల ల‌ను ఆశ్రయించింది. ఈ కేసు కూడా సీఐడీ ద‌ర్యాప్తు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version