సీక్రెట్ పాలిటిక్స్: నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ అనిల్ కుమార్ కు లేదా ?

-

ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు సిటీ రాజకీయాలపై పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కన్ను ఉంటుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు అన్న విషయంపై పందాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుండి వైసీపీ తరపున అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నారాయణపై గెలిచి సంచలనం సృష్టించారు. కానీ తాను మంత్రిగా ఉండి పదవి కోల్పోయిన అనంతరం నుండి శత్రుమూక ఎక్కువగా అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంతలా అంటే … ఇక్కడ మారుతున్న రాజకీయ పరిణామాలు జగన్ ను కూడా అనిల్ పై నమ్మకాన్ని పోగొడుతున్నాయి. తాజాగా నెల్లూరు నుండి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఇద్దరూ తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్ ను కలిశారట. సీఎం జగన్ వీరితో చర్చించిన మేరకు నెల్లఁరోయె ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పోటీ చేయాలని చెప్పారట.

ఇందుకు వేమిరెడ్డి నేను ఎంపీగా పోటీ చేయాలంటే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీటు అనిల్ కు ఇవ్వద్దని కండిషన్ పెట్టారట. ఇందుకు ఎంపీ అదలా సైతం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరికోసం అనిల్ కు సీటు ఇస్తారా లేదా అన్న విషయం డైలమాలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version