మహిమాన్వి సికింద్రాబాద్ గణపతి ఆలయం !

-

జంటనగరాలలో ప్రసిద్ధి చెందిన గణపతి దేవాలయం సికింద్రాబాద్‌ గణపతి దేవాలయం. ఈ దేవాలయం విశేషమైనది. అనేక ప్రత్యేకతలు కలిగి ఉండటమే కాకుండా దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కొంగుబంగారంగా నిలిచింది. వినాయక చవితి సందర్భంగా ఈ విశేషాలు తెలుసుకుందాం…


సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలోగల గణపతి ఆలయం ప్రసిద్ధిపొందినది. పూర్వం సైనిక నివాస ప్రాంతంగా ఉన్న ఈస్థలంలో 1824లో సైనికులు మంచినీటి కోసం బావి తవ్వగా వినాయక విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం చతుర్భుజములు కలిగి కుడి చేతులలో అంకుశం ఎడమచేతిలో డమరుపాశం కలిగి, కింది చేయి కటిమోకాలిపై ముద్రలో బోర్లించుకొని ఎడమచేతిలో బీజాపూర ఫలం కలిగి బింబంపై కుడివైపు చంద్రవంక ఎడమ వైపు సూర్య బింబం కలిగి కుబేరస్థానం (ఉత్తరం) వైపు వెళ్ళు మూషికారూరుడై వెలసిన స్వామి భారతావనిలోనే విభిన్న రూపం విరుపాక్ష గణపతి రూపంలో గణేశ పురాణం వివరిం చినట్టు శ్రీ గణపతి స్వామి వారి బాల్యములో ఉపనయన కాలం లో సమస్త దేవతలు సమస్త ఆయుధములు బహుమతిగా ఇవ్వగా ఈశ్వరుడు సాక్షాత్ తన రూపమైన (ఆత్మావై పుత్రనామాసి) అన్నట్లుగా తన డమరుకము బహుమతిగా మొసంగి విరుపాక్ష గణపతిగా ప్రసిద్ధి చెందిది. ఈ దేవాలయంలో నిత్యం అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి.

దేవాలయ ప్రాంగణంలో నవగ్రహాలు, శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్ర హ్మణ్యస్వామి విష్ణుపరముగా శ్రీరామబంటు ఆంజనేయస్వామి, శ్రీ ఉమామహేశ్వరి సమేత ఉమామహేశ్వరులు శ్రీ ఆదిత్యాది నవ గ్రహం లు, శ్రీరాహు కేతు నీలకంఠ విరధనారాయణి మానసా కుబ్జికా సమేత సర్పబంధ విగ్రహములు కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రపాలకుడిగా అత్యంత వైభవోపేతముగా అలరారుచున్నది. ఈ దేవాలయంలో సంకష్టహర చతుర్థి, నవరాత్రులు, ఇతర అనేక ఉత్సవాలతో అలరారుతున్నది.
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు అనుకొని ఉన్న ఈ దేవాలయానికి ఎక్కడి నుంచి అయినా సులభంగా చేరుకోవచ్చు.
– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version