చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ రూపకర్త : పవన్ కళ్యాణ్

-

ఎస్సీ వర్గీకరణకు సీఎం చంద్రబాబు ఆద్యుడు, రూపకర్త అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు నాంది పలికిన చంద్రబాబుకు ధన్యవాదాలని అసెంబ్లీలో చెప్పారు. ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుంది. వర్గీకరణ బిల్లుకు మనస్పూర్తిగా ఆమోదం పలుకుతున్నామని.. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే కారణం చంద్రబాబు, మందకృష్ణ మాదిగ అని తెలిపారు. మాదిగల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఘనత మందకృష్ణదే అని పేర్కొన్నారు. 

మాదిగ అని చెప్పగలిగే గుండె ధైర్యం కలిగిన వ్యక్తి మందకృష్ణ అని.. ఆ కులానికి వన్నె తెచ్చిన ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పై చాలా చర్చలు జరిగాయని.. గుర్తింపు లేని కులాల పై విస్తృతంగా చర్చలు జరిగాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ ఇచ్చిన నివేదిక చాలా అద్భుతంగా ఉందని.. ఇది అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version