ఇటలీ కరోనాను ఎలా కంట్రోల్ చేస్తుందో చూడండి…!

-

రెండు వారాల క్రితం ఇటలీ లో కరోనా వైరస్ ని చూసిన వాళ్ళు అందరూ అనుకున్నది ఒక్కటే. ఆ దేశంలో కోటి మంది వరకు చనిపోయే అవకాశం ఉందని. రోజు రోజు రోజుకి అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరగడం మొదలయింది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే లక్ష దాటారు. ఇక మృతులు కూడా భారీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ దేశంలో దాదాపు 16 వేల మందికి పైగా చనిపోయారు.

దీనితో అసలు ఆ దేశం కరోనా వైరస్ నుంచి బయటకు వస్తుందా లేదా అనేది అర్ధం కాలేదు. కాని అక్కడ కరోనా వైరస్ కట్టడి అయింది. ఆ దేశం కరోనా వైరస్ ని విజయవంతంగా కట్టడి చేస్తుంది. రోజు రోజుకి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం ఇటలీలో మొత్తం కేసులు 132547గా ఉండగా… మృతుల సంఖ్య 16523గా ఉంది. సోమవారం కొత్తగా 3599 కేసులు నమోదవ్వగా… 636 మంది చనిపోయారు.

మొన్నటి వరకు వెయ్యి మంది వరకు ఆ దేశంలో రోజు చనిపోయే వారు. దీనితో దేశాన్ని కాపాడుకోవడానికి గానూ ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 9న ఇటలీ లాక్‌డౌన్ ప్రకటించింది. మందులు, ఫుడ్ మార్కెట్స్ తప్ప అన్నీ మూసేసింది. పార్కులు, థియేటర్లు, మాల్స్, క్లబ్బులు, పబ్బులు అన్నీ మూసేసింది. రూల్స్ అతిక్రమించేవారికి 3 నెలల జైలు, భారీ జరిమానాలు విధించింది. ఇక కేసుల సంఖ్య తగ్గడంతో సోకిన వారిని జాగ్రత్తగా ఆస్పత్రుల్లో జాయిన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో మరణాల సంఖ్య తగ్గుతూ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version