సీతానగరంలో రేప్ చేసింది వాళ్లిద్దరే..?.. కేసులో పురోగతి

గుంటూరు: సీతానగరంలో సంచలన రేపిన గ్యాంగ్ రేప్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసుల పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. సీతానగరంకు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులను బాధితురాలి గుర్తించడంతో వారే అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా ధృవీకరించినట్లు తెలుస్తోంది.

రే

ప్ అనంతరం నిందితులు పరారీలో ఉన్నారని గుర్తించారు. వీరికి మరికొంత సహకరించినట్లు సమాచారం. ప్రధానంగా దాస్ అనే వ్యక్తి నిందితులకు సహకరించినట్లు గుర్తించారు. నిందితుల ఫోన్లు దాస్ దగ్గరే ఉన్నట్లు భావిస్తున్నారు. వీరి కోసం ఆరు బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తున్నారు. ప్రధాన నిందితులు పేర్లు కృష్ణ, వెంకటేశ్‌గా గుర్తించారు. రేప్ అనంతరం వీరిద్దరూ కృష్ణానదిలోని పడవలో పరారీ పోయినట్లు అనుమానిస్తున్నారు.

మొత్తం వీరి గ్యాంగ్‌లో అయిదారుగు ఉన్నట్లు నిర్ధారించారు. వీరంతా చెడు వ్యసనాలకు బానిసలై కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒంటరి జంటలను టార్గెట్ చేసి అఘాత్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం కృష్ణా నది ఒడ్డున ప్రేమ‌జంటపై ఈ గ్యాంగ్ దాడికి పాల్పడించింది. యువకుడిని కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి కూత వేటు దూరంలో గ్యాంగ్ రేప్ జరగడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.