కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఒక ముస్లిం ఫ్యామిలీ అంతా పోలీసుల వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకున్న సంగతి కలకలం రేపుతోంది. అయితే అది ఇంకా మరువక ముందే అదే కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ మునాఫ్ కుటుంబం విడుదల చేసిన సెల్పీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. తనకు దక్కిన కాంట్రాక్టు పనులు చేయ్యకుండా ఎమ్మెల్యే శిల్పా రవి, ఆయన అనుచరులు అడ్డుకొని ఇతరులకు కట్టబెట్టారని సదరు కాంట్రాక్టర్ అరోపించారు.
తమకు న్యాయం జరగకుంటే అత్మహత్య తప్ప మరో దారి లేదని, సూసైడ్ పాల్పడతామంటూ మునాఫ్ కుటుంబం అవేదనతో సెల్పీ వీడియో రిలీజ్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. వారం రోజుల క్రితం ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అత్మహత్య కేసు పెద్ద వివాదంగా మారడం, ఇప్పుడు అదే నంద్యాలకు చెందిన ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ రాజకీయ వేధింపులు కారణంగా అత్మహత్య చేసుకుంటా అంటూ సెల్పీ వీడియో పెట్టడం కలకలం రేపుతుంది. మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది.