శరీర ఆరోగ్యానికి అవసరమైనటువంటి కొవ్వు పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. కాకపోతే అనవసరమైన కొవ్వు పదార్థాలను మరియు మోతాదుకు మించి అస్సలు తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు జీర్ణవ్యవస్థకు ఎంతో సహాయపడుతుంది. అయితే నెయ్యిలో ఎంతో మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి, పైగా సరైన మోతాదులో తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కేవలం కొవ్వు పదార్థాలు మాత్రమే కాకుండా నెయ్యిలో ఎన్నో మంచి పోషక విలువలు కూడా ఉంటాయి. కాకపోతే కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి నెయ్యిని అస్సలు తీసుకోకూడదు.
నెయ్యి తో పాటుగా పెరుగును తీసుకోవడం వలన శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పై ప్రభావం ఎంతో ఉంటుంది. ఈ విధంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తేనెతో కలిపి నెయ్యి ను తీసుకోవడం వలన శరీరంలో టాక్సిన్లు పెరిగిపోతాయి. ఈ విధంగా శరీరంలో వేడి పెరుగుతుంది మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సహజంగా ఆరోగ్యానికి తాజా పండ్లను తీసుకోవడం ఎంతో అవసరం. కానీ పండ్లతో పాటుగా నెయ్యి ను తీసుకోవడం వలన మీరు తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవ్వడానికి ఎంతో కష్టం అవుతుంది. కనుక పండ్లతో పాటుగా నెయ్యిని తీసుకోకపోవడమే మేలు.
ఈ మధ్యకాలంలో చాలా శాతం మంది ఉదయాన్నే ఖాళీ కడుపున వేడినీళ్లతో పాటుగా నెయ్యిని తీసుకుంటున్నారు. ఇలా చేయడం వలన నెయ్యిలో ఉండేటువంటి పోషకాలు తగ్గిపోతాయి. పైగా ఎటువంటి ఉపయోగం ఉండదు. వేడి నీళ్లతో మాత్రమే కాకుండా టీ లేక కాఫీ వంటి వాటితో నెయ్యిని తీసుకోవడం వలన ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి మరియు జీర్ణ వ్యవస్థ పనితీరుపై ఎంతో ప్రభావం పడుతుంది. నెయ్యితో పాటుగా చేపలను కూడా తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే శరీర మెటబాలిజం పూర్తిగా దెబ్బతిని జీర్ణవ్యవస్థ పనితీరు తగ్గుతుంది మరియు చర్మ సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతాయి. కనుక ఇటువంటి ఆహార పదార్థాలతో పాటుగా నెయ్యిని అస్సలు తీసుకోకూడదు.