సినిమా ఎలా ఉన్నా రికార్డులు వచ్చిపడుతున్నాయి..

-

ఓటీటీలో మాస్ ప్రేక్షకులకి కావాల్సిన సినిమా రావట్లేదని చాలా రోజులుగా ఎదురుచూస్తున్న జనాలకి లక్ష్మీ రూపంలో సినిమా రిలీజైంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైంది. దాంతో ఒక్కసారిగా ప్రేక్షకులందరూ లక్ష్మీ సినిమా చూసేందుకు ఎగబడ్డారు. ఐతే సినిమాకి విమర్శకుల నుండి సరైన స్పందన రాలేదు. కానీ డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమా రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజైన అన్ని సినిమాల్లోకెల్లా అత్యధిక వ్యూస్ దక్కించుకున్న చిత్రంగా లక్ష్మీ నిలిచింది.

ఇంతకుముందు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ దిల్ బేచరా మీద ఉన్న రికార్డు ఇప్పుడు లక్ష్మీ సినిమా దక్కించుకుంది. ఒకే రోజులో రికార్డు లెవెల్లో వ్యూస్ దక్కించుకుని దూసుకుపోతుంది. సినిమాకి సరైన స్పందన లేకుండానే ఈ లెవెల్లో వ్యూస్ వచ్చాయంటే బాగుంటే మరో లెవెల్లో ఉండేదనడంలో సందేహం లేదు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించాడు.

Read more RELATED
Recommended to you

Latest news