సీనియర్ సిటిజన్ల కి గుడ్ న్యూస్..!

-

సీనియర్ సిటిజన్స్ కి శుభవార్త. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు దాటినా వాళ్ళు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా వారి యొక్క డబ్బుని ఆదా చెయ్యచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ ఒక రిటైర్మెంట్-బెనిఫిట్స్ అకౌంట్. ఇండియా లో వుండే సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా చెప్పొచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే… ఈ స్కీము వలన స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు.

senior citizens

ఇందులో పెట్టుబడి పెట్టడం సురక్షితం. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ స్కీము పెట్టుబడి పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2023తో ముగిసే త్రైమాసికంలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లను 70 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది కేంద్రం. రూ. 1000 లేదా రూ. 1000 మల్టిపుల్స్ ఎవరైనా సరే అకౌంట్ ని తెరవచ్చు.

ఈ అకౌంట్ ని కావాలంటే వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా అయినా సరే తెరవవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి ఐదేళ్ల తర్వాత కావాలనుకుంటే మీ అకౌంట్ ని క్లోజ్ చేసేయచ్చు. దానిని మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వడ్డీ రేటు సంవత్సరానికి 8.2% (ఏప్రిల్-జూన్). 8 శాతం నుంచి 8.2 శాతానికి ఏప్రిల్ నెల నుండి పెరిగింది. కనుక ఇక మీదట మరెంత ఎక్కువ వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news