తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో నూతన సర్కారు ఏర్పాటైన తర్వాత పలు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. కొంతమంది తమకు తాముగానే రాజీనామాలు చేస్తే, ఇక ఖాళీ అయిన ఆ నామినేటెడ్ పోస్టులను సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు భర్తీ చేస్తున్నది.
రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు హయాంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం ప్రజాపక్షం ‘ఎడిటర్’గా ఉన్నారు.