అర్షదీప్ సింగ్ పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

-

ఆసియా కప్ సూపర్ ఫోర్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో కీలక సమయంలో క్యాచ్ నెలపాలు చేశాడు టీమిండియా యంగ్ పెసర్ హర్షదీప్ సింగ్. ఈ క్యాచ్ వదిలేయడంతో హర్షదీప్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా వికీపీడియాలో అతడు కలిస్తానీ అంటూ భారీగా ట్రోలింగ్ జరిగింది. ఆ సమయంలో భారత క్రికెటర్లందరూ హర్షదీప్ కు అండగా నిలిచారు. అయితే తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అఖీబ్ జావిద్ హర్షదీప్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” హర్షదీప్ అరకొర ఆటగాడని, అతనికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే సీన్ లేదన్నాడు.

ప్రభావిత బౌలర్, గొప్ప బౌలర్ అనే ట్యాగ్ లేదని జావేద్ వ్యాఖ్యానించాడు. “టి-20 లో హర్షదీప్ బేసిక్ బౌలర్, ఎందుకంటే పొట్టి ఫార్మర్ లో భువనేశ్వర్ లా బంతిని స్వింగ్ చేసే బౌలర్ కావాలి. లేకపోతే మంచి యార్కర్లను సంధించగలిగి ఉండాలి. అయితే అర్షదీప్ సాధారణ బౌలర్ మాత్రమే. అందుకే ఇలాంటి బౌలర్లను ప్రత్యర్థులు పెద్దగా లెక్క చేయరు”. అని జావేద్ వ్యాఖ్యానించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version