ఏపీయే రూ.17వేల కోట్లు ఇవ్వాలి..అబద్ధమైతే రాజీనామా చేస్తా – సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీనే తెలంగాణకు బాకీ ఉందన్నారు. గడిచిన 8 ఏళ్ల తెలంగాణలో 10,000 మెగా వాట్ల కరెంటు పెంచుకున్నామని.. కేంద్రం 4 మెగా వాట్లు కూడా పెంచలేదని ఫైర్ అయ్యారు. విభజన చట్టంలో నాలుగు వేల మెగా వాట్లు ఇవ్వాలని ఉంటే నాలుగు మెగా వాట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

ఏపీ నుంచి రూ.17828 కోట్లు తెలంగాణకే రావాలని… సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పించడం లేదని ఫైర్ అయ్యారు. ఏపీకి రూ. 6000 కోట్లు నెల రోజులు కట్టాలని అంటున్నారు.. ఇవ్వాల్సిన రూ. 3000 కోట్లకు 18% వడ్డీతో ఆరు వేల కోట్లు కట్టాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తా అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం అన్నీ అమ్మేస్తోంది, వ్యవసాయం, విద్యుత్‌ మాత్రమే మిగిలాయి.. సంస్కరణల పేరుతో వీటిని అమ్మేందుకు చూస్తున్నారు.. దుబ్బాకలో పండే పంటను సిద్ధిపేటలోనే అమ్మే పరిస్థితి ఉండదు, కేంద్రం ఎక్కడైనా అమ్ముకోవచ్చని మాయ మాటలు చెబుతోందన్నారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version