మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రరాష్ట్ర బలగాలు వరుసగా ఎన్‌కౌంటర్స్ జరుపుతున్న తరుణంలో మావోయిస్టు కేంద్ర కమిటీ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.శాంతి ఒప్పందానికి సిద్ధమంటూ కేంద్ర కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 86 మంది పోలీస్ బెటాలియన్ కార్యాలయంలో ఐజీ (IG) ఎదుట సరెండర్ అయ్యారు.
లొంగిపోయిన వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లు..పక్కా బూటకపు ఎన్‌కౌంటర్లు అంటూ ఈ నెల 3న భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. అందులో కార్పొరేట్ దోపిడీని సులభతరం చేసేందుకు కేంద్రం దేశంలో మావోయిస్టుల నరమేధానికి తెరలేపారని ఆక్షేపించారు. ఆదివాసీలు, విప్లవకారులు ఈ నర సంహారాన్ని వెంటనే ఆపాలని తాము చర్చలకు సిద్ధం అంటూ లేఖలో ప్రస్తావించిన విషయం తెలిసిందే.