తెలంగాణలోని సంక్షేమ గురుకులాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి. సమస్యల కారణంగా అటు విద్యార్థులతో పాటు టీచర్లు సైతం అవస్థలు పడుతున్నారు. దీనికారణంగా విద్యాబోధనకు అడ్డంకి ఏర్పడుతోందని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం త్వరితగతిన సంక్షేమ గురుకులాల సమస్యలపై ఫోకస్ చేయాలని ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సంక్షేమ గురుకులాలకు చెందిన విద్యార్థులు, టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంబంధిత జేఏసీ డిమాండ్ చేసింది. అందుకోసం ఈనెల 28న విధులను బహిష్కరించేందుకు పెన్‌డౌన్, చాక్‌డౌన్ చేపడతామని ప్రభుత్వానికి అల్టీమేటం జారీచేసింది. మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జిలు పెంచాలని డిమాండ్ చేసింది.ఈనెల17,18 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని, 9 గురుకులాల కార్యదర్శులకు హెచ్‌ఎంలు లేఖు రాయాలని నిర్ణయించింది.