కరోనా వ్యాక్సిన్ కోసం అందరూ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయినా సరే వ్యాక్సిన్ విషయంలో ఏదోక విధంగా ఇబ్బందులు వస్తున్నాయి తాజాగా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కి ఇబ్బంది వచ్చింది. ఈ నేపధ్యంలో మన దేశంలో కూడా హ్యూమన్ ట్రయల్స్ ని ఆపేశారు. దీనిపై సీరం కీలక ప్రకటన చేసింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుండి అనుమతి పొందిన తరువాత సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా… ఆస్ట్రాజెనెకా కు చెందిన కోవిడ్ -19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను తిరిగి ప్రారంభిస్తుందని స్పష్టం చేసింది.
హ్యూమన్ ట్రయల్స్ సురక్షితంగా ఉన్నాయని… మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ధృవీకరించిన తరువాత ఆస్ట్రాజెనీకా ఆక్స్‌ఫర్డ్ కరోనా వైరస్ వ్యాక్సిన్, ఎజెడ్డి 1222 కోసం క్లినికల్ ట్రయల్స్ యుకెలో తిరిగి ప్రారంభమైనట్లు ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా శనివారం తెలిపింది.