వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మందిపై కేసు నమోదు అయింది. ‘చలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు వైసీపీ నేతలు. అనుమతి లేకుండా నిరసన చేపట్టడంతో పేర్ని నాని, పేర్ని కిట్టు, కైలే అనిల్, సింహాద్రి రమేశ్, దేవినేని అవినాష్‌తో పాటు 400 మందిపై కేసు నమోదు చేశారు.

ఇంకా మరికొందరిపై కేసులు నమోదు అయ్యే ఛాన్సు ఉంది. నిరసనలో పాల్గొన్న నేతలు మెడికల్ కాలేజీ స్థాపనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు మాత్రం అనుమతి లేకుండా పెద్ద సంఖ్య లో రహదారిపైకి రావడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటనతో మచిలీపట్నంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఎన్ని కేసులు పెట్టినా.. కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.