సింహానికి కోడిని ఎరగా వేసి వేధించిన ఏడుగురికి జైలుశిక్ష..!

-

ప్రభుత్వాలు వన్యప్రాణులను హింసించడం ఎంతో నేరంగా పరిగణిస్తుంది. వీటిలో అంతరించిపోయే దశలో ఉన్న జంతువును వేటాడితే ఇక అంతే సంగతులు. కోర్టుల చుట్టూ తిరుగుతూ కూర్చోవాలి. అలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి ఘటనే 2018లో గుజరాత్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఏడుగురు వ్యక్తులు గిర్ అడవిలోకి వెళ్లి ఓ సింహంతో వేధించారు. కోడిని ఎరగా వేసి.. సింహాన్ని పట్టుకుని టార్చర్ పెట్టారు. అలా టార్చర్ పెడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు ఆ ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో అహ్మదాబాద్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులతో సహా ఏడుగురిని అరెస్ట్ చేసింది. ఈ మేరకు నిందుతులను హైకోర్టులో హాజరుపరిచారు. ఈ ఏడుగురిని దోషులుగా గిర్ గధాడ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ సునీల్ కుమార్ దేవ్ ప్రకటించారు.

loin
loin

గిర్ అడవుల్లో బాబారియా పరిధిలోని ధూంబకారియాలో కొందరు వ్యక్తులు ఓ కోడిని సింహానికి ఎరగా వేసి పట్టుకున్నారు. కోడిని ఆశ పెడుతూ పైశాచికానందం పొందారు. అలా వాళ్లు టార్చర్ పెడుతున్న వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేయగా.. హైకోర్టు ముందు ఉంచారు. వాదోప వాదనలు విన్న గుజరాత్ హైకోర్టు.. నిందితులను దోషులుగా పరిగణించింది. వీరిలో ఆరుగురిని మూడేళ్లపాటు కఠిన కారాగార శిక్ష విధించగా.. మరొక వ్యక్తికి ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. గిర్ గధాడ తాలూకాకు చెందిన ఇలియాస్ హోత్, అబ్బాస్ బలూచ్, అల్తాఫ్ బలూచ్, అహ్మదాబాద్‌కు చెందిన పర్యాటకులు రవి పటాడియా, రతిన్ భాయ్ పటేల్, దివ్యంగ్ గజ్జర్‌కు హైకోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది.

వన్యప్రాణి రక్షణ చట్టం సెక్షన్-2 (16/బి) ప్రకారం ఏదైనా జంతువును బంధించడం, ఉచ్చువేయడం, ఎర వేయడం, హింసించటం, అభయారణ్యంలో అక్రమంగా ప్రవేశించడం నేరం. చట్టాన్ని వ్యతిరేకించి వన్యప్రాణ జంతువులను వేధించిన ఈ ఏడుగురు దోషులను కోర్టు శిక్షించింది. వీరికి రూ.10 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. దీంతోపాటు సింహాల సంక్షేమ నిధికి రూ.35 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. జంతువులను హింసించడం తగదని, వన్యప్రాణులపై కఠినంగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news