ఢిల్లీలో తీవ్రమైన వాయుకాలుష్యం.. అక్కడ 454కు చేరిన ఏక్యూఐ!

-

ఢిల్లీలో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) దారుణంగా పడిపోతోంది. ఆదివారం ఉదయం ఎన్సీఆర్‌లో ఏక్యూఐ 265గా నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది. ఇక పట్‌పర్‌గంజ్ 294, నెహ్రూ నగర్ 258, ఆర్ కే పురంలో 251గా ఏక్యూఐగా నమోదైంది. వివేక్ విహార్ 302, షాదీపూర్‌ 322, ఆనంద్ విహార్‌లో ఏకంగా 454కు పడిపోయింది. దీనిని తీవ్రమైన కేటగిరీగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్చరించింది.

కాగా, ఆనందవిహార్‌లో గాలి నాణ్యత క్షీణించడంపై ఢిల్లీ ప్రభుత్వం స్పందిస్తూ.. ఇక్కడ ఏక్యూఐ క్షీణతకు యూపీ నుంచి వచ్చే బస్సులే కారణమని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అతిశీ, పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆనంద్ విహర్‌లో పర్యటిస్తూ స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలుష్య నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.అందుకోసం ఢిల్లీలో 99 టీములను ఏర్పాటు చేశామన్నారు.హర్యానా,యూపీలు శుద్ది చేయని వ్యర్థాలను విడుదల చేస్తున్నాయని సీఎం అతిశీ ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version