ఏపీలో అధికార వైసీపీ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో భారీగా సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ తిరుగులేని బలంతో ముందుకెళుతుంది. ఇక గత ఏడాది జరిగిన అన్నీ ఎన్నికల్లోనూ వైసీపీ సత్తా చాటింది. అసలు టీడీపీకి ఏ మాత్రం కూడా ఛాన్స్ దొరకలేదు. దీంతో టీడీపీ పని అయిపోయిందని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇక ఆ పార్టీ నేతలు కూడా జగన్ సీఎంగా 30 ఏళ్ళు ఉంటారని మాట్లాడుతున్నారు. ఇలా వైసీపీ నేతలు బాగా కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నారు.
అలాగే చంద్రబాబు సీఎంగా గెలిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, చంద్రబాబుకు ఇక గెలిచే సత్తా లేదని నాని మాట్లాడారు. జగన్‌ని గద్దె దించి.. చంద్రబాబు సీఎం సీటులో కూర్చోంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోతానని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రబాబు ఓడిపోతే సొంత వూరు వెళ్లిపోతారా? అని ప్రశ్నించారు.
అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఏం అవుతుందో ఇప్పుడే చెప్పలేం…కానీ కొడాలి మాత్రం మళ్ళీ జగనే సీఎం అవుతారని ఘంటాపథంగా చెబుతున్నారు. అసలు కొడాలి నానికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక టీడీపీ నేతలు కొడాలి విషయంలో డౌట్ పడుతున్నారు. కరెక్ట్ గా చూసుకుంటే జగన్ మళ్ళీ గెలవరని, కానీ కొడాలి ఇంత కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారంటే…ప్రశాంత్ కిషోర్‌తో ఏదో వ్యూహాలు వేసి ఉంటారని డౌట్ పడుతున్నారు. మరి చూడాలి కొడాలి అన్నట్లు జరుగుతుందో లేదో?