జగిత్యాల జిల్లాలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

-

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో సోమవారం రాత్రి 11 గంటలకు ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రెండు జంటలు, ఓ నిర్వాహకున్ని అదుపులోకి తీసుకున్నారు.

గత కొంతకాలంగా కోరుట్ల, మెట్‌పల్లి, పట్టణ శివారు కాలనీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే సోమవారం సమాచారం అందడంతో పోలీసులు విటులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సెక్స్ రాకెట్ నిర్వాహకుడికి రాజకీయ పరంగా పరిచయాలు ఉన్నట్లు సమాచారం. కాగా, అదుపులోకి తీసుకున్న ఇద్దరు విటులు, నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news