దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించనుంది. ఫిబ్రవరి 15తో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ కాలం ముగియనుంది. దీంతో ఆ లోపే ఎన్నికలు పూర్తి చేసి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్నికల సంఘం ముందుకు సాగుతుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు బీజేపీ, ఆప్ కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి.
ఈ తరుణంలో దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలతో మార్మోగిపోతుండగా.. అధికారంలో ఉన్న ఆప్ పార్టీ ముందస్తుగానే ప్రచారం చేస్తోంది. మరోసారి అధికారమే లక్ష్యంగా చేసుకొని ఢిల్లీ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తుంది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఢిల్లీ కోట పై కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తోంది.