ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి రోజున తగ్గిన కరోనా కేసులు ఇవాళ అమాంతం పెరిగిపోయాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా ఏకంగా 11,919 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడిచిన 24 గంటలలో ఏకంగా 11,242 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా యాక్టు కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఇండియాలో ప్రస్తుతం యాక్టు కేసుల సంఖ్య 1,28,763 గా నమోదు అయింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు.. 62 కోట్ల మందికి పైగా కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా… 114.46 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ లను ఆ వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక దేశవ్యాప్తంగా రోజు వారి కరోనా మహమ్మారి కేసులు శాతం 0.97 గా నమోదు అయ్యిందని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.
#Unite2FightCorona#LargestVaccineDrive
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/SEnC6ljvO1 pic.twitter.com/ud0cWcT3go
— Ministry of Health (@MoHFW_INDIA) November 18, 2021