అన్నదాతకు అవమానం.. ఏడు రోజులపాటు మాల్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు

-

పంచెకట్టుతో వచ్చిన ఓ అన్నదాతను బెంగళూరులోని ఓ మాల్‌లోకి రానివ్వకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది.7 రోజుల పాటు మాల్‌ను మూసివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రవర్తన వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం కిందికే వస్తుందంటూ తీవ్ర స్థాయిని మండిపడింది.

అసలేం జరిగిందంటే..?మంగళవారం మాగడి రోడ్డు జీటీ మాల్‌లోని మల్టీప్లెక్స్‌ కి కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు హావేరికి చెందిన ఫకీరప్ప అనే అన్నదాత వెళ్లారు. కాని అక్కడి కాపలాదారు గోపాల్‌ పంచె కట్టుకుని రావాదాంతో ఆయన్ను లోపలికి అనుమతించలేదు. ఫకీరప్ప కుమారుడు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ ఘటనపై రైతు సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. మాల్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని ఒకవేళ చెప్పకపోతే, పంచెకట్టుతో వేల మంది రైతులు వచ్చి మాల్‌ను ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. దాంతో దిగొచ్చిన మాల్ యాజమాన్యం..రైతుకు శాలువా కప్పి సత్కరించి అందరి ముందు క్షమాపణలు కోరింది. ఇకపై ఇటువంటి పొరపాటు చేయబోమని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news