రుణమాఫీ చేసిన రేవంత్.. రాజీనామాపై హరీష్ రావు యూ టర్న్

-

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 లక్షల మంది రైతులను ఋణాలను ఒక్క క్లిక్ తో మాఫి చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఆగస్ట్ నెలాఖరులోపు విడతల వారీగా రుణాలను మాఫీ చేయనున్నారు రేవంత్. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మాజీమంత్రి హరీష్ రావు ని టార్గెట్ చేస్తూ సెటైర్లు పేలుస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. సీఎం రేవంత్ చెప్పినట్లుగా గడువులోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరిన బీఆర్ఎస్ నేత ఏమయ్యారంటూ కౌంటర్లు పెడుతున్నారు. సవాల్ ప్రకారం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా హరీష్ రావు రాజీనామాకు వేళైంది అంటూ డిఫెన్స్ లో పడేసేందుకు రెడీ అయ్యారు.

అయితే దీనిపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.తాను కేవలం రుణమాఫీ గురించి మాత్రమే సవాల్ చేయలేదని చెప్పుకొచ్చారు.ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తే రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా మాట మార్చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తానని రేవంత్ భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇవ్వడంతో.. హరీష్ రైతుల ఓటు బ్యాంక్ చేజారిపోకుండా ఉండేలా రేవంత్ కు సవాల్ చేశారు. ఆగస్ట్ 15 లోపు రేవంత్ రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు. రాజీనామాకు సిద్దంగా ఉండు హరీష్ అంటూ అప్పట్లోనే రేవంత్ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు రుణమాఫీ ప్రక్రియ మొదలు కావడంతో రాజీనామాపై తాను అలా అనలేదని నాలుక మడతేశారు.

రైతు రుణ‌మాఫీ విష‌యంలో గ‌తంలో కేసీఆర్ స‌ర్కార్ తీవ్ర విమ‌ర్శ‌లను ఎదుర్కొంది. ల‌క్ష రుణ‌మాఫీ కూడా ఏడాదికి 25వేల చొప్పున నాలుగుసార్లు చేస్తామని, వ‌డ్డీతో సంబంధం లేద‌ని కండీష‌న్లు పెట్టడంతో రైతులంతా తిట్టిపోశారు. కానీ, కాంగ్రెస్ స‌ర్కార్ ఇప్పుడు ఏక‌కాలంలో మాఫీ చేస్తోంది. అవి రైతుబంధు డ‌బ్బులా, ఇంకోటా అనేది త‌ర్వాత విష‌యం. రైతును అప్పు నుండి విముక్తి చేయ‌టమే ముఖ్యం. బీఆర్ఎస్ నేతలు అన్నట్లు అవి రైతుబంధు డ‌బ్బులే అనుకున్నా రోడ్లకు, వెంచర్లకు,పెద్ద పెద్ద భూస్వాముల‌కు ఇవ్వ‌ము అని రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఎప్పుడో స్ప‌ష్టం చేసింది.

రైతుబంధు కూడా అమలు చేస్తామని మరోవైపు సీఎం చెప్తున్నారు. కేసీఆర్ మాదిరి సాకులు వేతకలేదని క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కారు మాట నిలబెట్టుకుంది. దీనిని అందరూ స్వాగతిస్తున్నారే తప్ప డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు అని అడగడం లేదు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా మారాలి అని రైతులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news