శామీర్ పేట ఘటన: గన్ ఫైర్ చేసింది నేను కాదు.. టీవీ9 మరియు ఎన్టీవీ లపై కేసు పెడతాను !

-

ఈ రోజు హైదరాబాద్ లోని శామీర్ పెట్ లో సిద్దార్ధ్ అనే వ్యక్తిపై మనోజ్ అనే వ్యక్తి గన్ తో కాల్చిన ఘటన సంచలనమ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి ప్రముఖ సీరియల్ నటుడు అయిన మనోజ్ అనుకుని అతని పేరును, ఫోటోలను, ఇంస్టా వీడియోలను వాడుతూ ఇతనే గన్ ఫైర్ చేసింది అంటూ ఉదయం నుండి వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీరియల్ నటుడు మనోజ్ ఒక క్లారిటీ ఇచ్చాడు.. మీరు అంతా అనుకుంటున్నట్లు ఈ గన్ ఫైర్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ మనోజ్ నేను కాదు అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఎటువంటి నిజం తెలుసుకోకుండా.. కొన్ని మీడియా చానెళ్లు నా పేరును, ఫోటోలను వాడుకుని నన్ను డి ఫేమ్ చేశారంటూ బాధపడ్డాడు.

 

నా ఫోటోలను మరియు నేను అనుకుని వార్తలను రాసిన టీవీ9 మరియు ఎన్టీవీ ల పైన కేసు పెడతాను అంటూ క్లియర్ గా చెప్పాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది, కాగా ఇతను మౌనపోరాటం మరియు ఇతర సీరియల్స్ లో నటించి ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news