పవన్ పిచ్చాసుపత్రి నుండి పారిపోయిన వ్యక్తిలాంటి వాడు : మంత్రి రోజా

-

మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ.. పవన్‌కు ఫ్యాన్స్ ఉంటే, జగన్‌కు సైన్యముందని అన్నారు. పవన్ పిచ్చాసుపత్రి నుండి పారిపోయిన వ్యక్తిలాంటి వాడని విమర్శించారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని పవన్‌కు జగన్‌ను విమర్శించే స్థాయి లేదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టుకొలేని పార్టీ జనసేన పార్టీ అని ఎద్దేవా చేశారు. 2024లో ప్రజలందరూ జగనన్న క్రీడా సంబరాలల్లో ఆడుకుంటే.. పవన్, చంద్రబాబులతో సీఎం జగన్ ఆడుకుంటారని పేర్కొన్నారు.

 

RK Roja counters Pawan Kalyan over his tweets on govt, asks what he has  done in the pastఅంతకుముందు కూడా.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి రోజా తిప్పికొట్టారు. కరోనా టైమ్‌లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుంటే.. ఇక్కడ ప్రజలకు సేవలందించింది వాలంటీర్లేనని చెప్పారు. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలకు విజిల్స్, చప్పట్లు కొడుతున్న పవన్ అనుచరులు సైతం.. వాలంటీర్ల సేవలు అందుకున్న వారేనన్నారు గుర్తు చేశారు. చంద్రబాబు పూనిన చంద్రముఖిలాగా పవన్ పిచ్చిగంతులు వేస్తున్నారని మండిపడ్డారు. అసలు పవన్ తల్లి, పెళ్లాం గురించి ఎవరు తప్పుగా మాట్లాడారని ప్రశ్నించారు. పవన్ నీతులు చెబుతుంటే.. సన్నీలియోన్ వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంస్కారం గురించి మాట్లాడే అర్హత పవన్‌కి ఎక్కడిదని అడిగారు. పవన్ పనికిమాలినోడని, ఆయన మాటలు వింటే లాగిపెట్టి కొట్టాలనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news