ఎక్కడైనా ప్రత్యర్ధుల వల్ల నేతలకు రాజకీయాల్లో ఇబ్బందులు వస్తాయి..అదేంటో ఎమ్మెల్యే రోజాకు మాత్రం సొంత పార్టీ నేతల వల్ల ఇబ్బందులు ఎక్కువ వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రోజాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు…కానీ అధికారంలోకి వచ్చాక ఏది కలిసిరావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మంత్రి పదవి రాలేదు..సరే ఎలాగోలా వచ్చిన ఏపిఐఐసి ఛైర్మన్ పదవి నిలబడలేదు. ఇక చివరికి సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా రాజకీయం నడపడం మొదలుపెట్టారు.
ముందు నుంచి నగరిలో వైసీపీ నేతలు రోజాకు వ్యతిరేకంగానే ముందుకెళుతున్నారు. ఆ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో రోజా వ్యతిరేక వర్గం ఏ స్థాయిలో రాజకీయం నడిపిందో చెప్పాల్సిన పని లేదు. అయితే వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఎలాగోలా పరిస్తితులని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కానీ వ్యతిరేక వర్గం ఎక్కడా తగ్గడం లేదు…రోజాకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నడిపిస్తూనే ఉంది. తాజా రోజా వ్యతిరేక వర్గంగా ఉన్న రెడ్డివారి చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ఆలయం ఛైర్మన్ పదవి వచ్చింది. అలాగే నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కేజీ కుమార్ సతీమణి శాంతికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చింది.
దీంతో రోజాకు చాలా ఆగ్రహం వచ్చింది…వారిని సైడ్ చేయడానికి రోజా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ రోజా ప్రయత్నాలు సఫలమయ్యేలా లేవు. ఆమె వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టడం కష్టమనే చెప్పాలి. ఇక వ్యతిరేక వర్గం వల్లే రోజాకు నగరిలో గెలుపు ఇబ్బంది అయ్యేలా ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో వారే రోజాని దెబ్బకొట్టేలా ఉన్నారు. మొత్తానికైతే రోజా డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పొచ్చు.