మీలాగా నేను ప‌క్క‌లేసి సంపాదించ‌లేదు…జబర్దస్త్ కమెడియన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…!

-

జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలామంది నటీనటులు అభిమానులను సంపాదించుకున్నారు. అలా లేడీ గెటప్ ల‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జబర్దస్త్ నటుడు శాంతిస్వరూప్. ఆది స్కిట్ ల‌లో లేడీ గెటప్ లు వేసే శాంతి స్వరూప్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శాంతి స్వ‌రూప్ పై ఆది వేసే పంచ్ లు ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులు పూయిస్తాయి. అయితే తాజాగా శాంతి స్వరూప్ ఒక కారును కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా శాంతి స్వరూప్ త‌న‌తో వ‌ర్క్ చేసిన‌…లేడీ గెట‌ప్ లు వేసిన‌ కొంతమంది తన స్నేహితులు త‌న‌ను అవమాన పరిచారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

shanti swaroop
shanti swaroop

తాను గతంలో నా కలల కారు అంటూ యూట్యూబ్ లో ఓ వీడియోని పెట్టాన‌ని శాంతి స్వరూప్ పేర్కొన్నారు. అయితే ఆ వీడియోను డిలీట్ చేశాన‌ని దానికి కార‌ణం ఇప్పుడు చెబుతాన‌ని అన్నారు. ఆ కారు తన కారు కాదని షూటింగ్ జరుగుతుండగా అక్కడ ఒక ఆర్ కనిపిస్తే ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని తన కారు అన్న‌ట్టుగా వీడియో తీసాన‌నిని శాంతి స్వ‌రూప్ చెప్పారు. ఆ వీడియో తర్వాత తనకు చాలా మంది ప్రేక్షకులు కంగ్రాట్స్ చెప్పారని కానీ కొంతమంది త‌న‌తో వ‌ర్క్ చేసేవాళ్లు..లేడీ గెట‌ప్ లు వేసేవాళ్లే అవ‌మానించారని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

అస‌లు కారును తాకే అర్హత నీకు ఉందా అంటూ తనను దారుణంగా అవమానించారని శాంతిస్వరూప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు తాను కారును కొనబోతున్నా అని కాబట్టి మాట్లాడే సందర్భం వచ్చింది అని అన్నారు. మీలాగా పక్క లేసి…అడ్డ‌దారుల్లో నేను డబ్బు సంపాదించలేదు బంగారం నగలు కొనుక్కోలేదు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. మీలాగా నేను కూడా చెడ్డ పనులు చేస్తే ఒక్క‌రాత్రిలో కార్లు, విల్లాలు కొన‌గ‌ల‌ను కానీ నేను అలాంటి తప్పులు చేయను అంటూ వ్యాఖ్యానించారు. తన‌ను కించపరిచిన వారికి చెబుతున్నానని మీ దగ్గర ఉంటే అది మీ దగ్గర పెట్టుకోండి కానీ ఇతరులను కించపరచకూడదు అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news