ఈ నెల చివరలో ఆరోగ్యశాఖలో 39 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం : సీఎం జగన్

-

ఆరోగ్యశాఖలో 39 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు. కోవిడ్‌ నివారణకు ఇదివరకు ఉన్న ఆంక్షలను కొనసాగిస్తున్నామని.. మరో 2 వారాలపాటు రాత్రిపూట కర్ఫ్యూ, ఆంక్షలను కొనసాగిస్తూ ఇప్పటికే అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. ఈ ఆంక్షలు కచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్యశాఖలో 39 వేల మందిని నియమిస్తున్నామనీ.. ఇప్పటి వరకూ 27 వేలమందిని రిక్రూట్‌ చేశామన్నారు.

మిగిలిన వారిని ఈ నెలాఖరులోగా నియమించాలని.. డాక్టర్లు, నర్సులు లేరు, పారామెడికల్‌ సిబ్బంది లేరనే మాట వినకూడదని వెల్లడించారు. మార్చి 1 నుంచి ఈ విషయంలో కలెక్టర్లను బాధ్యులుగా చేస్తానని.. అందుబాటులో ఉండడం, సమస్యలు చెప్పే వారి పట్ల సానుభూతితో ఉండడం అన్నది ప్రతి ఉద్యోగి బాధ్యత అని స్పష్టం చేశారు. దీనివల్ల చాలావరకు సమస్యలు తీరిపోతాయని.. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంద్వారా పూర్తి హక్కలు వారికి లభిస్తాయని చెప్పారు.

లబ్ధిదారుల్లో అవగాహన కల్పించండని.. డాక్యు మెంట్లు ఉన్న ఆస్తికీ, డాక్యుమెంట్లు లేని ఆస్తికీ ఉన్న తేడాను వారికి వివరించాలని ఆదేశాలు జారీ చేశారు. స్పందనకోసం కొత్తగా మనం ఆధునీకరించిన పోర్టల్‌ను ప్రారంభించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news