జాతీయ రాజకీయాల్లో అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడుతుంటే.. విపక్షాలపైన కూడా బీజేపీ నేతలు అంతే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా.. బీజేపీపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్‌లో ఆధిక్యాన్ని చూసుకుని మిడిసిపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు శరద్ పవార్. వారికి గుణపాఠం చెప్పగలిగే సత్తా ప్రజలకు ఉందని హెచ్చరించారు శరద్ పవార్. రాష్ట్రపతి పదవిపై కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ అంశాన్ని ఉద్దేశించి.. పవార్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. బ్రిటీష్ సామ్రాజ్యంలో రవి అస్తమించడు అనేదనేది ఒక పురాణ గాథ ఉండేదన్న పవార్ సామాన్య ప్రజలు ఏకమవడంతో ఆ సామ్రాజ్యం కూలిపోయిందని వివరించారు శరద్ పవార్.
రాష్ట్రపతి పదవిని ఉద్దేశించి ఓ ఎంపీ తప్పుపదం వాడారని కానీ తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు శరద్ పవార్. అయితే బీజేపీ మాత్రం సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిందని, ఆమెను ఇబ్బందికి గురి చేశారని.. కానీ తమ పార్టీ ఎంపీ సుప్రియా సూలే సోనియాను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని చెప్పారు శరద్ పవార్. కాగా.. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ రాష్ట్రపతి పదవిపై చేసిన పదాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఆయన, సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే అధిర్ క్షమాపణలు చెప్పారు.