ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సోషల్ మీడియా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అందుకోసం రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాలు, కూడళ్లలో సోషల్ మీడియాను మంచికే వినియోగించాలని ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వానికి మద్దతుగా హీరో నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియాను ఎలా వాడాలనే దానిపై ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.
సోషల్ మీడియాను మంచికోసమే ఉపయోగించాలని, ఏదైనా కంటెంట్, న్యూస్‌ను షేర్ చేసే ముందు పరిశీలించుకోవాలని సూచించారు. మీరు సరదాగా చేసే పోస్ట్‌ల కారణంగా జీవితాలు నాశనం అవుతున్నాయని హితవు పలికారు. ఇదిలాఉండగా, గతంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన పోస్టులకు గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు వైసీపీ నేతలపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపిన విషయం తెలిసిందే.
👉సోషల్ మీడియాను మంచికోసం ఉపయోగించాలన్న నిఖిల్.
👉న్యూస్‌ను షేర్ చేసే ముందు పరిశీలించాలన్న హీరో.
👉సరదాగా చేసే పోస్ట్‌ల కారణంగా జీవితాలు నాశనం అవుతున్నాయన్న నటుడు. pic.twitter.com/riZkX80oda— ChotaNews App (@ChotaNewsApp) December 30, 2024