పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడారన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల. ఆయన రాజకీయ నాయకుడిగా మాట్లాడలేదని తెలిపారు. అల్లు అర్జున్ అరెస్టుతో పుష్ప 2 సినిమాకి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని పేర్కొన్నారు. పుష్ప 2 సినిమా ఇంకా రెండు నెలలు నడుస్తుందన్నారు.
గురుకుల విద్యార్థిని శైలజ కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదు అంటున్నారు.. అన్ని చోట్లకు సీఎం వెళ్లడం సాధ్యం కాదని చిట్ చాట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అల్లు అర్జున్ అరెస్టు తో పుష్ప కలెక్షన్లు పెరిగాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంబటి రాంబాబు మంచి కళాకారుడు… అంబటి రాంబాబుకి అంత సీన్ లేదని చురకలు అంటించారు. నెక్స్ట్ సినిమాలో నటించడానికి అంబటి రాంబాబుకి మంచి రోల్ వస్తుందన్నారు.