స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టండి అని కోరారు హరీష్ రావు. భారత రత్నకు అన్ని రకాల అర్హులు మన్మోహన్ సింగ్…ఆయన మంచి లాయ లిస్ట్ అన్నారు. మనిషి గొప్పతనం… అధికారంలో ఉన్నప్పుడే కాదు చేదు అనుభవల్లో కనిపిస్తుందని వివరించారు. మన్మోహన్ సింగ్ నీ మౌన ముని అంటారన్నారు.
కాంగ్రెస్ ఓటమి తర్వాత… ఆంటోని కమిటీ వేసిందని… కాంగ్రెస్ ఓటమికి కారణం పీవీ..మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలు కారణం అని తేల్చారని ఫైర్ అయ్యారు. దీంతో మన్మోహన్ సింగ్ కంటతడి పెట్టారన్నారు. ఐనా మౌనంగా ఉన్నారు… అది ఆ పార్టీ పట్ల ఆయనకు ఉన్న లాయల్టీ అని కొనియాడారు. తాను చేసిన నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తప్పు పట్టినా…మన్మోహన్ సింగ్ ఏం అనలేదని తెలిపారు. అది కాంగ్రెస్ పట్ల ఉన్న లాయల్టీ అన్నారు.