నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్…షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

-

వైఎస్సార్టీపీ అధినేత షర్మిల కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగింది. నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద పదవులు అనుభవిస్తూ, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ అంటూ షర్మిల ఫైర్ అయ్యింది. ఉద్యమకారుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెంత మందిని బలితీసుకొంటే నోటిఫికేషన్లు ఇస్తారు దొరా? అంటూ షర్మిల ప్రశ్నించింది. మీకు కనికరం లేదు, కనీసం చీమ పారినట్టు కూడా లేదు.

Sharmila comments on cm kcr

ఎందుకంటే చచ్చేది మీ బిడ్డలు కాదు కాబట్టి అంటూ వ్యాఖ్యానించింది. మీకు సీట్లు, ఓట్ల మీదున్న ఆరాటం యువత ప్రాణాల మీద లేదు అంటూ మండి పడింది. నిన్న మహేష్, ఈ రోజు లవన్ కుమార్, శ్రీకృష్ణ.. ఈ ఏడాది దాదాపు 20 మందికి పైగా నిరుద్యోగులను చంపిన హంతకుడు మీరు అంటూ కేసీఆర్ పై ఫైర్ అయ్యింది. మరొక్క నిరుద్యోగి ప్రాణం పోకముందే నోటిఫికేషన్లు వేయండి. లేదంటే రాజీనామా చేయండి అంటూ షర్మిల కేసీఆర్ ను డిమాండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version