తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చంద్రబాబుది కాదని.. సొంత నియోజకవర్గంలోనే మూలాలు పోయిన తర్వాత ఇంకా చంద్రబాబు కొనసాగటం కరెక్ట్ కాదని చురకలు అంటించారు. చంద్రబాబు తప్పుకుని తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ కుటుంబానికి ఇస్తే మంచిదని ఎద్దేవా చేశారు.
తన మీద చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ చాలా దుర్భాషలాడారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీ ఒక జిల్లా కు, మున్సిపాలిటీ కి పరిమితం కాలేదని అర్థం అయ్యిందని.. సర్పంచ్ ఎన్నికలలో చంద్రబాబు గెలువలేని పరిస్థితి ఉందని చురకలు అంటించారు.
మున్సిపల్ ఎన్నికల్లో విజయవాణి హైస్కూల్ ను టీడీపీ నేతలు ధ్వంసం చేశారని నిప్పులు చెరిగారు. ప్రజలు ఛీ కొట్టిన తర్వాత ఇంకా చంద్రబాబు కుప్పం గురించి మాట్లాడతారని నేననుకోనని ఎద్దేవా చేశారు పెద్ది రెడ్డి. తాను 17వ తేదీన మాట్లాడతానని ఆ రోజే చెప్పామనీ.. చంద్రబాబు పుంగనూరు వచ్చి పోటీ చేస్తానంటే తాను ఆహ్వానిస్తానని పేర్కొన్నారు. చంద్రబాబు నా మీద పోటీ చేస్తారేమో ఆయన్నే అడగండి ? అని పెద్దిరెడ్డి అన్నారు.