ఈ ఎన్నికల్లోనే కేటీఆర్ సీటును త్యాగం చెయ్యాలని అడిగిన షర్మిల !

-

ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మోదీ ప్రభుత్వం.. దాదాపుగా పాస్ అయినపోయినట్లే.. ఎందుకు అంటే పార్లమెంట్ లో బీజేపీకి తగినంత బలం ఉంది.. ఇక ఎప్పటిలాగే కొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఇక ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో తెలంగాణా మంత్రి కేటీఆర్ భారతీయ పౌరుడిగా గర్విస్తున్నానంటూ, మహిళా రిజర్వేషన్ లను అమలు చేయడం కోసం నా సీటైనా త్యాగం చేయడానికి రెడీ అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన YSRTP అధినేత్రి షర్మిల మాట్లాడుతూ… కేటీఆర్ గారూ బిల్లు అమలు అవ్వడానికి ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది. అప్పటి వరకు ఎదురుచూడడం ఎందుకు ? మరికొంతకాలంలో జరగనున్న ఎన్నికలకే మీ సీటును ఒక మహిళా కోసం త్యాగం చేయండి అంటూ కౌంటర్ వేసింది షర్మిల.

ఇంకా షర్మిల మాట్లాడుతూ.. మహిళల రిజర్వేషన్ ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే , ఈ బిల్లు మీ పోరాటం యొక్క ఫలితం అయితే మీ పార్టీ ప్రకటించిన సీట్ లలో 33 % సీట్లు మహిళలకు ఇవ్వండి అంటూ డిమాండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version