బిగ్ బాస్ 7: ప్రిన్స్ యావర్ కు “కఠినపరీక్ష”… ఆకాశమే బద్దలయ్యేలా గౌతమ్ శోభల గొడవ !

-

బిగ్ బాస్ సీజన్ 7 లో రోజు రోజుకి యాజమాన్యం ఏ విధంగా ఉంటే ప్రేక్షకులు ఆసక్తికరంగా చూస్తారు, అందుకు మనము ఎలాంటి కంటెంట్ ఇవ్వగలం అని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రతిరోజూ ఏదో ఒక అర్ధం లేని లొల్లి పెట్టుకోవడం, గందరగోళంగా కొంచెం కూడా స్పృహ లేకుండా ఫాల్తూ ఫాల్తూ గా అరవడం. ఇక తాజాగా ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ కు సంబంధించి బిగ్ బాస్ కట్ చేసిన ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో మూడవ అస్త్ర ను దక్కించుకోవడానికి బిగ్ బాస్ డైరెక్ట్ గా సెలెక్ట్ చేసిన వారిలో అమర్, ప్రిన్స్ మరియు శోభా లు ఉన్నారు. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఒక్కొక్కరిని పిలిచి ముగ్గురిలో ఎవరు పవర్ అస్త్రను గెలుచుకోవడానికి అనర్హులో చెప్పుమనగా… ప్రిన్స్ కు ఎక్కువ ఓట్లు పడడంతో.. అతను చాలా ఎమోషనల్ అయిపోయాడు. మనలో ఎంత ప్రతిభ ఉన్నా ఇక్కడ పాలిటిక్స్ కు బలి అవ్వడం గ్యారంటీ అని బలంగా ఫిక్స్ అయిపోయాడు. కానీ ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చి.. మళ్ళీ తాను అర్హుడని అని నిరూపించుకునే అవకాశాన్ని కల్పించాడు ప్రిన్స్ కి, అయితే ఈ టాస్క్ చాలా ఘోరంగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక స్టాండ్ మీద గడ్డం పెట్టి ఎవరు ఏమి చేసినా తదుపరి బజార్ వచ్చే వరకు తీయకుండా ఉంటే అర్హుడు అవుతాడు అంటూ ప్రకటిస్తారు బిగ్ బాస్. దీనితో ప్రిన్స్ ఎలాగైనా గెలవాలని కసితో ఒక వర్గం సభ్యులు అంతా ఏమి చేస్తున్నా పట్టించుకోకుండా కసిగా నిలబడతాడు. ముఖ్యంగా ఇతన్ని ప్రియాంక, దామిని, తేజ, రతిక లు చాలా ఇబ్బంది పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఆ తర్వాత అమర్ మరియు శోభా శెట్టిలు అనర్హులని ఎవరు చెప్పారో బిగ్ బాస్ వీడియో చూపించగా , అందులో శోభా అనర్హురాలని గౌతమ్ చెప్పడంతో అతనిపై గొడవకు దిగింది శోభా.. అస్సలు వీరిద్దరూ మనము ఎక్కడున్నాము.. లైవ్ షో లో ఉన్నామన్నది మరిచిపోయి నోటికివచ్చినట్లు మాట్లాడుకున్న తీరు చాలా మందిని నిరాశకు గురి చేసిందని చెప్పవచు. ఇక ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో ఎవరు అర్హులు అవుతారో ? అసలు ప్రిన్స్ కి ఏమి జరిగినదో తెలియనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version