రేవంత్ రెడ్డిది కడుపు మంట అయితే షర్మిలది గుండె తడి అని షర్మిల అనుచరుడు తూడి దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను అస్థిర పరచడానికి రేవంత్ ప్రయత్నం చేశారని కాంగ్రెస్ ను ఓడ గొట్టేందుకు షర్మిల పార్టీ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. తెలంగాణ సమాజంలో షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన ఓ సంచలనం అని ఎవరు డబ్బు తీసుకుని పని చేస్తున్నారో ప్రజలందరూ చూశారని అన్నారు.
షర్మిల పార్టీ ప్రకటన చేయకముందే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను కాంగ్రెస్ కాపీ కొడుతుందని అన్నారు. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి పేరు లేకుండా కాంగ్రెస్ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందన్న ఆయన కాంగ్రెస్ రాష్ట్రంలో తుడిచి పెట్టుకుని పోయిందని అన్నారు. రేవంత్ కు షర్మిల రాజకీయ పార్టీపై కడుపు మంట అందుకే ఆమె మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారని అన్నారు.